అంగన్వాడీ సెంటర్లకు ప్రభుత్వం అందించే పోషణఆహారం
* పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట అక్టోబర్ 3 (ప్రజావాణి)
జమ్మికుంట పట్టణ పరిధిలో కేవికే లో అంగన్వాడీ పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ప్రభుత్వం గొప్పగా ఆలోచిస్తోంది ఎందుకంటే తల్లులు బాగుంటేనే పిల్లలు కూడా సమర్థవంతంగా బలంగా పెరుగుతారు పిల్లలు బాగుంటేనే ఎంతో భవిష్యత్తు కూడా నెక్స్ట్ తరానికి లభిస్తుంది కనుక ప్రభుత్వం మీకన్నా ఎక్కువ శ్రద్ధ వహిస్తోంది ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించి మీ అందరికీ ప్రతిసారి అవేర్నెస్ చెప్తూనే ఉంటారు ఎందుకు చెప్తారు ఎప్పటికప్పుడు ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు జన్మిస్తే,ఆరోగ్యవంతంగా మారితే మనకు వైద్య ఖర్చులు తగ్గుతాయి, చదువుకోవచ్చు మనందరికీ పెద్ద ఖర్చు ఆరోగ్యం పిల్లలు ఆరోగ్యం,పిల్లలు ముందుగా మన ఆరోగ్యం బాగుంటే ఇవన్నీ వస్తాయి కనుక మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు కోవిడ్ పాండమిక్లో మనం తీసుకున్న జాగ్రత్తలు ఒక నిమ్మకాయ నేర్పించిందికషాయం నేర్పించిందిపక్క ఇంట్లో ఉన్నటువంటి పొరుగిల్లు నేర్పించింది ఇవన్నీ నేర్చినవి గనుక మీరందరూ కూడా దయచేసి తల్లులకిఅంగన్వాడీ ఆయాలకి టీచర్లకి తల్లులందరికీ కూడా మీరు మొహమాటపడొద్దు ప్రభుత్వం మీ పేరు మీద ఇంత ఖర్చు చేయాలని మీకు కొన్ని అధికారాలుకొన్ని సెంటర్లు కేటాయించింది గనుక మీరు బాధపడొద్దు మీకు కావలసినటువంటి ప్రతి ఫలాన్ని కూడా మీరు అడగాలి మీకు అందుబాటులో ఉన్నటువంటి మేడమ్, టీచర్ లేదా మీకు అందుబాటులో ఉన్నటువంటి కౌన్సిలర్ చైర్మన్ మేడమ్ కౌన్సిలర్లు మొహమాటం లేకుండా అడిగి ప్రభుత్వం నుంచి వచ్చే పోషకాహారాన్ని తీసుకోండి బలమైన పిల్లలని తీర్చిదిద్ది బలమైన పౌరులుగా వారు కూడా ఉండడానికి తోడ్పడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ ఎంపీడీవో అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడి ఆయాలు పిల్ల తల్లులు తదితరులు పాల్గొన్నారు

