📄 ePaper
Epaper 2
Saturday, October 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమహాత్మా గాంధీ యూనివర్సిటీ అంతర కళాశాలల వాలీబాల్ పోటీల నిర్వహణ.

మహాత్మా గాంధీ యూనివర్సిటీ అంతర కళాశాలల వాలీబాల్ పోటీల నిర్వహణ.

📰 Generate e-Paper Clip

మహాత్మా గాంధీ యూనివర్సిటీ అంతర కళాశాలల వాలీబాల్ పోటీల నిర్వహణ.

మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహించిన అంతర కళాశాలల వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో మహిళల విభాగంలో 8 జట్లు, పురుషుల విభాగంలో 11 జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి.

మహిళల విభాగంలో నీలగిరి డిగ్రీ కాలేజ్, నల్లగొండ ప్రథమ బహుమతి సాధించగా, ఆర్మీ డిగ్రీ కాలేజ్, భువనగిరి రన్నరప్‌గా నిలిచింది.

పురుషుల విభాగంలో డాక్టర్ ఎం.ఎం.ఆర్. కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విజేతగా నిలవగా, కార్త్యాయణి డిగ్రీ కాలేజ్, నల్లగొండ రన్నరప్ బహుమతి సాధించింది.

పురుషుల విభాగంలో బెస్ట్ ఇంప్రెషన్ ప్లేయర్ అవార్డును సంతోష్ కుమార్, మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, సాగర్, అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కే. అంజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య అంజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి జట్టు క్రీడాకారులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ మద్దిలేటి పసుపుల, పీడీలు డాక్టర్ మురళి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రొఫెసర్ ఆకుల రవి, డా శ్రీదేవి హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.