పూడూరులో మున్సిపల్ వాటర్ ట్యాంకర్ టైర్ల చోరీ
పూడూరు: మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్ పూడూరు గ్రామంలో మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన వాటర్ ట్యాంకర్ రెండు టైర్లు చోరీకి గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.
మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని వైకుంఠధామం వద్ద ప్రజా అవసరాల కోసం వినియోగించే వాటర్ ట్యాంకర్‌ను నిలిపి ఉంచారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు ట్యాంకర్‌కు సంబంధించిన రెండు టైర్లను తొలగించి చోరీ చేశారు. చోరీకి గురైన రెండు టైర్ల విలువ సుమారు రూ.50 వేల వరకు ఉంటుందని సిబ్బంది తెలిపారు.
ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వెల్లడించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి, టైర్ల చోరీకి పాల్పడిన వారిని గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజలకు తాగునీటి సరఫరా వంటి అవసరాల కోసం వినియోగించే వాటర్ ట్యాంకర్ టైర్లను సైతం దొంగిలించడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ఆస్తుల రక్షణకు అధికారులు, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

