📄 ePaper
Epaper 2
Sunday, October 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రజా సమస్యలు వేగంగా పరిష్కరించాలి

ప్రజా సమస్యలు వేగంగా పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

ప్రజా సమస్యలు వేగంగా పరిష్కరించాలి..
ఎమ్మెల్యే డా.మురళి నాయక్
సర్పంచులు అధికారులతో సమీక్ష సమావేశం

ప్రజావాణి,నెల్లికుదురు:ప్రజా సమస్యల పరిష్కరించడంలో ఆలస్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ అధికారులకు సూచించారు. నెల్లికుదురు లో శనివారం సర్పంచులకు వివిధ శాఖ అధికారులకు నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శాఖల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా మురళి నాయక్ గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, గ్రామాభివృద్ధిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటోందని, అదే స్ఫూర్తితో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సేవలు ఎలాంటి ఆలస్యం లేకుండా అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, కార్యాలయాలకే పరిమితం కాకుండా గ్రామాలను తరచూ సందర్శించి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.సమావేశంలో తాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలు, గ్రామీణ రహదారుల మరమ్మతులు, పారిశుధ్యం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు, వ్యవసాయ శాఖ పనితీరు, సాగునీటి సమస్యలు, పింఛన్లు, రేషన్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు ఎక్కడ పెండింగ్‌లో ఉన్నాయో గుర్తించి వాటిని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో ఉన్న సమస్యలు, ప్రజల అవసరాలు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ప్రతి సమస్యను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే చర్చించి పరిష్కార మార్గాలను సూచించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో తీసుకోవాలని, చిన్న సమస్య అయినా నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో తహసిల్దార్ చందా నరేష్,ఎంపీడీవో సింగారపు కుమార్, సర్పంచులు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.