నూతన్‌కల్ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని ఎంపీకి వినతి
సానుకూలంగా స్పందించిన ఈటల రాజేందర్.. అధికారులకు ఆదేశాలు
ఎల్లంపేట, (
ప్రజావాణి): ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని నూతన్‌కల్ గ్రామంలో పెద్ద చెరువు కట్టపై నుంచి కానుకుంట రోడ్డు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మేడ్చల్ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కోరారు. గ్రామ ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన అవసరాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా నూతన్‌కల్ గ్రామానికి సంబంధించిన రోడ్డు సమస్యను ఎంపీ ఈటల రాజేందర్‌కు వివరించి, రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించి, రోడ్డు నిర్మాణానికి త్వరగా నిధులు మంజూరు చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు నాయకులు తెలిపారు.
పెద్ద చెరువు కట్టపై నుంచి కానుకుంట రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం పూర్తయితే నూతన్‌కల్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారకుండా శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని తెలిపారు. ఎంపీ సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంపై స్థానిక నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సద్ది సురేష్ రెడ్డి, చిన్నోళ్ల భాస్కర్, నాతి వేణుగోపాల్ గౌడ్, మండల నాయకులు మల్లికార్జున్, యూనిస్ పాషా, జగదీశ్వర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, జీవన్, ఆనంద్, సుదర్శన్, భూషణం, మహేందర్ రెడ్డి, సురేష్ చారి, సత్యనారాయణ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

