📄 ePaper
Epaper 2
Sunday, October 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్హకీంపేట్ ఆర్టీసీ డిపోలో కాంగ్రెస్ నాయకుల జోరు

హకీంపేట్ ఆర్టీసీ డిపోలో కాంగ్రెస్ నాయకుల జోరు

📰 Generate e-Paper Clip

హకీంపేట్ ఆర్టీసీ డిపోలో కాంగ్రెస్ జోరుగా ప్రచారం

కార్మికుల సంక్షేమమే లక్ష్యం.. సమస్యల పరిష్కారానికి అండగా ఉంటాం

హకీంపేట్, అక్టోబర్ 3: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం హకీంపేట్ ఆర్టీసీ డిపోలో జోరుగా సాగింది. అక్టోబర్ 9న జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, హకీంపేట్ డిపో గౌరవ అధ్యక్షుడు భీమిడి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు డిపోలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులను కలిసి ఎన్నికల ప్రాధాన్యతను వివరించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన తెలంగాణ వర్కర్స్ యూనియన్ (TWU) అభ్యర్థులకు మద్దతు ఇచ్చి బాణం గుర్తుపై ఓటు వేయాలని కార్మికులను కోరారు.

కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: రాములు నాయక్

మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులకు అనేక హామీలు ఇచ్చినా వాటిలో చాలా వరకు అమలు కాలేదని విమర్శించారు. ఉద్యమ సమయంలో కార్మికుల మద్దతు తీసుకుని, తెలంగాణ ఏర్పడిన అనంతరం యూనియన్ వ్యవస్థపై ఆంక్షలు విధించారని ఆరోపించారు. ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు సంబంధించిన అంశాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: వజ్రేష్ యాదవ్

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ హకీంపేట్ డిపో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యలను సంబంధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

కార్మికులకు అండగా ఉంటాం: జైపాల్ రెడ్డి

హకీంపేట్ డిపో గౌరవ అధ్యక్షుడు భీమిడి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కార్మికులకు అండగా ఉంటామని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే యూనియన్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పి. మహిపాల్ రెడ్డి, అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టి. రమేష్, మూడుచింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి. వెంకటేశం, మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్. నాగరాజు, హకీంపేట్ డిపో అధ్యక్షుడు తులసిరామ్, సెక్రటరీ పవన్ యాదవ్, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు వైస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఎస్. మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచులు ఎ. నగేష్ యాదవ్, బి. కిషోర్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు ఎస్. వేణుగోపాల్ రెడ్డి, ఆర్. శ్రీనివాస యాదవ్, వి. నర్సింహారెడ్డి, విష్ణు, ఎస్. ఆనంద్, పి. బాల్ రాజు, వి. శేశాంత్, భరత్ కుమార్, నాగరాజు తదితర కాంగ్రెస్ నాయకులు, ఆర్టీసీ యూనియన్ ప్రతినిధులు కృష్ణ, శ్రీశైలం, పుష్పలత, కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.