📄 ePaper
Epaper 2
Sunday, October 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు సతీష్ గౌడ్

నరసింహులపేట- ప్రజావాణి

డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ సలహాలు, సూచనల మేరకు గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు, నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. శనివారం గ్రామ సర్పంచ్ జక్కుల ఉప్పలయ్య యాదవ్, ఉప సర్పంచ్ చిమ్ముల నవీన్ రెడ్డితో కలిసి గ్రామంలో పర్యటించిన ఆయన మరుగునీరు నిలిచే ప్రాంతాలు, డ్రైనేజీ సమస్యలు, పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి దేవస్థానం, పీర్ల కొట్టం, బతుకమ్మ ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం అవసరాన్ని సర్పంచ్, ఉప సర్పంచ్ సతీష్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సతీష్ గౌడ్, ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ ప్రతినిధిగా ఈ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి, సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన సహకారం అందేలా కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే సహకారంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇంకా అవసరమైన పనులను గుర్తించి దశలవారీగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. సర్పంచ్, ఉప సర్పంచ్ తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి కచ్చితంగా సహకరిస్తామని సతీష్ గౌడ్ హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధిలో ప్రజలు, పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వెంకన్న, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహబూబ్ బాషా, వార్డు సభ్యులు హెచ్. యాకయ్య, గ్రామస్తులు అర్వపల్లి చిర్ర మధు, పాతూరు సందీప్ రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.