📄 ePaper
Epaper 2
Saturday, October 3, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriగాంధీ జయంతి సందర్భంగా ఘట్కేసర్‌లో రక్తదాన శిబిరం....లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ

గాంధీ జయంతి సందర్భంగా ఘట్కేసర్‌లో రక్తదాన శిబిరం….లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, అక్టోబర్ 2 (ప్రజావాణి): మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఘట్కేసర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ.. అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గాలను ఆయుధాలుగా చేసుకుని స్వాతంత్య్ర ఉద్యమానికి మహాత్మా గాంధీ నాయకత్వం వహించారని కొనియాడారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి సమాజానికి కూడా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, దేశ ఐక్యత, శాంతి, అభివృద్ధికి తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో లాల్‌బహదూర్ శాస్త్రి యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మం, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, డీకొండ రఘు, శ్రావణ్‌కుమార్ గౌడ్, లయన్స్ క్లబ్ జనరల్ సెక్రటరీ బచ్చు నగేష్ గుప్త, చార్టర్ ప్రెసిడెంట్ సారా శ్రీనివాస్ గౌడ్, ట్రెజరర్ వేల్పుల రవికుమార్ యాదవ్, కార్యవర్గ సభ్యులు మారం లక్ష్మారెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, అల్లు కమలాకర్, బచ్చు ప్రమోద్ గుప్త, రామ్మోహన్, రాజ్‌కుమార్, సారా మురళి, సగ్గు వేణుమాధవ్, కోవా రాము, శ్రీధర్, హిమబిందు, మమత శర్మ, బోగా లక్ష్మి, రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన క్లబ్ సభ్యులందరికీ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.