📄 ePaper
Epaper 2
Saturday, October 3, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonమున్సిపాలిటీలో పీఎం సూర్య ఘర్ యోజనపై అవగాహన సదస్సు

మున్సిపాలిటీలో పీఎం సూర్య ఘర్ యోజనపై అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

మున్సిపాలిటీలో పీఎం సూర్య ఘర్ యోజనపై అవగాహన సదస్సు

జనగామ జిల్లా ప్రతినిధి,, అక్టోబర్ 03(ప్రజావాణి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ – ముఫ్త్ బిజిలి యోజనలో భాగంగా జనగామ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సేవా సేతు అభియాన్ అవగాహన సదస్సు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ అవగాహన సదస్సు విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ సంపత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రజలకు సోలార్ పై అవగాహన:

ఈ సందర్భంగా చైర్ పర్సన్ బాలమణి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లుల భారం నుండి విముక్తి పొందవచ్చని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న భారీ సబ్సిడీని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు కూడా సోలార్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

అనంతరం బ్యాంకు అధికారులు, సోలార్ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ…

1. సబ్సిడీ వివరాలు: 1KW నుండి 3 KW వరకు కేంద్ర ప్రభుత్వం రూ. 78,000/- వరకు సబ్సిడీ అందిస్తుందని,
2. *బ్యాంకు రుణం:* సోలార్ ఏర్పాటుకు తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు లభిస్తాయని,
3. *నెట్ మీటరింగ్:* మిగులు విద్యుత్ ను విద్యుత్ శాఖకు అమ్మడం ద్వారా ఆదాయం కూడా పొందవచ్చని,
4. *దరఖాస్తు విధానం:* http://pmsuryaghar.gov.in పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో సులభంగా ఉంటుంది
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలు, మున్సిపల్ కమిషనర్ రాజశేఖరరెడ్డి , కౌన్సిలర్లు విద్యుత్ శాఖ డిఈ , ఎఈ లు, బ్యాంకు మేనేజర్లు, సోలార్ వెండర్లు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.