కడప జిల్లా, పోరుమామిళ్ల అక్టోబర్ 3 ప్రజావాణి :కృష్ణంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు అధికార టీడీపీలోని అంతర్గత వర్గపోరును బహిర్గతం చేశాయి.పాఠశాల కమిటీ ఎన్నికలే అయినప్పటికీ. అధికార పార్టీకి చెందిన వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు ఒక్కసారిగా తెరపైకి రావడంతో గ్రామంలో రాజకీయ వేడి పెరిగింది.ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతకు అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు.పోలీసుల పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండటంతో కృష్ణంపల్లి గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.ఎస్ఎంసీ ఎన్నికల సందర్భంగా బయటపడిన వర్గ విభేదాలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.సాధారణంగా పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన కమిటీ ఎన్నికలు రాజకీయ రగడకు వేదికగా మారడంపై గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.ఎన్నికల కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి,ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు.ఎస్ఎంసీ ఎన్నికలతో మొదలైన ఈ వర్గపోరు.. రానున్న రోజుల్లో స్థానిక టీడీపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు కృష్ణంపల్లిలో చర్చనీయాంశంగా మారింది.
కడపజిల్లా. పోరుమామిళ్ల కృష్ణంపల్లిలో టీడీపీ వర్గపోరు బహిర్గతం!ఎస్ఎంసీ ఎన్నికల వేళ వేడెక్కిన రాజకీయం.భారీగా పోలీసుల మోహరింపు
RELATED ARTICLES

