📄 ePaper
Epaper 2
Saturday, October 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్బద్వేల్ లో టీడీపీ మద్దతుదారుల ఘన విజయం: ఎగువ తంబళ్లపల్లె స్కూల్ కమిటీ ఎన్నికల్లో క్లీన్...

బద్వేల్ లో టీడీపీ మద్దతుదారుల ఘన విజయం: ఎగువ తంబళ్లపల్లె స్కూల్ కమిటీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్!

📰 Generate e-Paper Clip

కలసపాడు మండలం ఎగువ తంబళ్లపల్లె అక్టోబర్ 03 ప్రజావాణి తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి దిశా నిర్దేశం మరియు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా జరిగిన పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు.నాయకులు, కార్యకర్తల సమన్వయంతో,సమిష్టి కృషితో సాధించిన ఈ విజయం నియోజకవర్గ తమ్ముళ్లలో కొత్త జోష్ నింపింది.ఎగువ తంబళ్లపల్లె పంచాయతీ పరిధిలోని రామాపురం హైస్కూల్ చైర్మన్‌గా తంబళ్లపల్లె పంచాయతీకి చెందిన సీనియర్ టీడీపీ కార్యకర్త పుల్లేటి షరీఫ్ ఎన్నికయ్యారు.అలాగే వైస్ చైర్మన్‌గా గుండ్లకుంట్ల ఓబులేసుతో పాటు కమిటీ సభ్యులు అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. స్థానిక నాయకుల వ్యూహాలు, కార్యకర్తల అలుపెరగని శ్రమ వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

విజేతలకు ఘన సన్మానం:

ఎన్నికల్లో ఘన విజయం సాధించి,నూతనంగా ఎన్నికైన చైర్మన్,వైస్ చైర్మన్ మరియు కమిటీ సభ్యులను చంద్రగిరి ప్రహల్లాద రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా సన్మానించారు. విజేతలకు శాలువాలు కప్పి, పూలమాలలతో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రగిరి ప్రహల్లాద రెడ్డి మాట్లాడుతూ.ఇన్-ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో టీడీపీ మరింత బలోపేతం అవుతోందని, రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి,విద్యార్థుల భవిష్యత్తుకు నూతన కమిటీ అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.విజేతల సన్మాన మహోత్సవంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎనుముల బాలకిరెడ్డి,గంగసాని వెంకట్ రెడ్డి,నాయబ్ రసూల్, గంగసాని రమణారెడ్డి, పల్లె నవీన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు సింగరాయపల్లె టీడీపీ నాయకులు గుడిమే జార్జ్,శీలయ్య,కోసూరి రమేష్, సుధాకర్ యాదవ్,యువ నాయకుడు తలారి నరసింహులు, ఐటీడీపీ మండల అధ్యక్షుడు చంద్రగిరి నరేష్ కుమార్ రెడ్డి సహా పెద్ద సంఖ్యలో యువత,స్థానిక ప్రజలు పాల్గొని విజయోత్సవాన్ని జరుపుకున్నారు.సమిష్టి కృషితో సాధించిన ఈ విజయంపై నియోజకవర్గవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.