📄 ePaper
Epaper 2
Sunday, October 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్బీజేవైఎం కాశినాయన మండల అధ్యక్షుడిగా శంఖవరం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

బీజేవైఎం కాశినాయన మండల అధ్యక్షుడిగా శంఖవరం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

శ్రీ అవధూత కాశినాయన మండల అక్టోబర్ 03 ప్రజావాణి బీజేవైఎం (భారతీయ జనతా యువ మోర్చా) నూతన అధ్యక్షుడిగా వరికుంట్ల గ్రామానికి చెందిన శంఖవరం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో నిర్వహించిన బీజేవైఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎన్నికను అధికారికంగా ప్రకటించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేవైఎం జోనల్ ఇంచార్జ్ సుబ్బరాజు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు బిజెపి కాశినాయన మండల అధ్యక్షుడు బిజీవేముల నారాయణ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు నూతనంగా ఎన్నికైన శంఖవరం ప్రసాద్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడంలో యువ మోర్చా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రసాద్ నేతృత్వంలో నూతన కమిటీ అంకితభావంతో పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నిక విజయవంతం కావడానికి మరియు ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నికకు బీజేపీ మండల అధ్యక్షుడు బిజీవేముల నారాయణ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి ప్రత్యేకంగా సహకరించి, సమన్వయం చేశారు.తన ఎన్నికకు సహకరించిన పెద్దలు బిజీవేముల నారాయణ రెడ్డికి,బుసిరెడ్డి మనోహర్ రెడ్డికి, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులకు కార్యకర్తలకు నూతన అధ్యక్షుడు శంఖవరం ప్రసాద్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, కాశినాయన మండలంలో బీజేవైఎం,బిజెపి పార్టీ బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఎదురు భాస్కర్ రెడ్డి,ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు మునీంద్ర యాదవ్,పవన్, జిల్లా కార్యదర్శి గురయ్య మండల పరిధిలోని పలువురు బీజేపీ, బీజేవైఎం సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.