*మహాత్మా గాంధికి లాల్ బహుదూర్ శాస్త్రికి ఘన నివాళులు…*
*నివాళులర్పించిన ఎమ్మెల్యే కుంభం అనిల్.*
*పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అజ్వర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్.*
*యాదగిరి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02*
జాతిపిత మహాత్మా గాంధీ , మాజీ ప్రధాన స్వర్గీయ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతిల సందర్భంగా భువనగిరి పట్టణ గాంధీ పార్క్ వద్ద నిర్వహించిన వేడుకల్లో భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన కీలక పాత్రను, దేశానికి ఆయన అందించిన సేవలను ఎమ్మెల్యే స్మరించు కున్నారు. గాంధీజీ చూపిన సత్యం , అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ అబ్జర్వర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ , లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సత్యం , అహింస , శాంతి, దేశభక్తి , నిజాయితీ వంటి మహనీయుల ఆశ యాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య సమరంలో మహాత్మాగాంధీ చేసిన సేవలు , స్వాతంత్ర్యా నంతరం దేశ నిర్మాణంలో లాల్ బహదూర్ శాస్త్రి అందించి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం , దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని నేటి తరానికి పిలుపునిచ్చారు.

