📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణయాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తజన సంద్రహం

యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తజన సంద్రహం

📰 Generate e-Paper Clip

*యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తజన సంద్రహం…*

*సెలవు దినం కావడంతో యాదాద్రికి పోటెత్తిన భక్తులు.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02*

తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో పంచనారసింహులు కొలువై ఉన్న యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో రాష్ట్ర నలుమూలల నుండి వస్తున్న భక్తజనుల ఆరాధనలు శాశ్వతకంగా కొనసాగాయి. అక్టోబర్ 02 మహాత్మా గాంధీ జయంతి సెలవు దినం కావడంతో శుక్రవారం రోజు యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోభక్తుల రద్దీ సాధారణ కంటే ఎక్కువగా పెరిగింది. ఉదయం నుంచి తమ కుటుంబ సభ్యులతో క్యూలైన్లలో బారులు తీరిన భక్తజనులు.. భక్తుల రద్దీ అధికంగా ఉండడం తో లక్ష్మీనరసింహుడి ఆలయ మాడవీధులు , కళ్యాణకట్ట , పుష్కరిణి , వ్రత మండపం , వాహనాల పార్కింగ్ , ఘాట్ రోడ్లు లలో పరిసరాలు భక్తులతో కిట కిటలాడాయి. స్వామి వారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించు కున్నారు. భక్తులు వారి కుటుంబ సభ్యులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్య స్థానాలను ఆచరించారు. పలువురు తలనీలాలను సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి వారి మొక్కులను చెల్లించు కున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.