📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణ51 ఎంక్వయిరీని నీరుగార్చేందుకే చైర్మన్‌ ఆశిస్తున్నారన్న ఆరోపణలను ఖండించిన సోమశేఖర రావు

51 ఎంక్వయిరీని నీరుగార్చేందుకే చైర్మన్‌ ఆశిస్తున్నారన్న ఆరోపణలను ఖండించిన సోమశేఖర రావు

📰 Generate e-Paper Clip

51 ఎంక్వయిరీని నీరుగార్చేందుకే చైర్మన్‌ ఆశిస్తున్నారన్న ఆరోపణలను ఖండించిన సోమశేఖర రావు.

రెగ్యులేటరీ అథారిటీ నిబంధనల ప్రకారమే సొసైటీలో ఖర్చులు జరిగాయని వెల్లడి.

ఎత్తొండ సొసైటీలో రూ.1.03 కోట్ల ఖర్చుల ఆరోపణలపై వివరణ.

తనపై 51 ఎంక్వయిరీ రాజకీయ ప్రేరేపితమేనన్న సోమశేఖర రావు.

సివిల్ సప్లై ధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆధారాలు చూపిస్తే సమాధానం ఇస్తానని స్పష్టం.

రైతుల అభిప్రాయాన్ని పోచారం శ్రీనివాస్ రెడ్డి గౌరవించాలని విజ్ఞప్తి.

కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం ఎత్తొండ క్యాంప్‌లో ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించిన వ్యవహారాలపై ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పలు అంశంపై గురువారం పలువురు రైతులు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సోమశేఖర రావు, రాజు దేశాయ్‌తో పాటు పలువురు రైతులు మాట్లాడుతూ. సొమశేఖర రావుపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తి సొసైటీ పాలకవర్గ సభ్యుడు కాకపోయినప్పటికీ సొసైటీ నిధులతో గోవా పర్యటనకు ఎలా వెళ్లారో ముందుగా ఆయన స్పష్టత ఇవ్వాలని రైతులు ప్రశ్నించారు.రైతుల ప్రయోజనాల దృష్ట్యా ధాన్యం ధరలు తక్కువగా ఉన్న సమయంలోఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించేందు కు ఢిల్లీ వెళ్లి కేంద్రస్థాయి అధికారులు,ప్రజాప్రతినిధులను కలిసినట్లు సోమశేఖర రావు వివరించినట్లు తెలిపారు.ఆ పర్యటనలకు సంబంధించిన విమాన ప్రయాణ ఖర్చులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సొసైటీ,రైతుల అవసరాల కోసమే జరిగాయని.అందుకు మహాజన సభ ఆమోదంతోనే ఖర్చులను నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారని తెలిపారు.సొసైటీ వందల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన సంస్థగా ఉన్నందున అవసరాల మేరకు వాహనం, ఐఫోన్ తదితర సౌకర్యాలను వినియోగించామని.అవి వ్యక్తిగత అవసరాల కోసం కాదని సోమశేఖర రావు స్పష్టం చేసినట్లు తెలిపారు.సభ్యుల నిర్ణయం మేరకు సొసైటీ అవసరాల కోసం చేసిన ఖర్చుల వివరాలను మహాజన సభ ముందు వెల్లడించినట్లు చెప్పారు.హమాలీ,విద్యుత్ బిల్లులు,రవాణా,పెట్రోల్ తదితర ఖర్చుల పేరుతో సుమారు రూ.1.03 కోట్ల మేర ఆరోపణలు చేయడం రాజకీయ ప్రేరేపితమని సోమశేఖర రావు పేర్కొన్నట్లు తెలిపారు. సివిల్ సప్లై ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదని.ఆరోపణలకు ఆధారాలు ఉంటే వాటిని చూపించాలని వాటిపై సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేసినట్లు తెలిపారు.51 ఎంక్వ యిరీ రాజకీయ ప్రేరేపితమని ఆరోపణ తనపై నిర్వహించిన 51 ఎంక్వయిరీ కూడా రాజకీయ ప్రేరేపితంగానే జరిగిందని సోమశేఖర రావు ఆరోపించినట్లు రైతులు తెలిపారు.తమ పాలకవర్గం ఇచ్చిన వాంగ్మూలాలను పూర్తిస్థాయిలో పరిగ ణనలోకి తీసుకోలేదని ఆయన పేర్కొన్నట్లు చెప్పారు.ఈ వ్యవహారంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే పొందినట్లు వివరించారు.సొసైటీ నిధుల నుంచి న్యాయవాదులకు రూ. 40 లక్షలు ఖర్చు చేశారన్న ఆరోపణలు కూడా అవాస్తవమని సోమశేఖర రావు పేర్కొన్నట్లు తెలిపారు.తొమ్మిది రిట్ పిటిషన్లకు సంబంధించిన న్యాయ ఖర్చులను తానే వ్యక్తిగతంగా భరించానని.సొసైటీ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా వినియోగించలేదని స్పష్టం చేసినట్లు చెప్పారు.2019-2023 మధ్యకాలానికి సంబంధించిన ఆడిట్ నివేదికల్లో వ్యత్యాసాలు ఉన్నాయని.వాటిపై కూడా సమగ్రంగా పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని సమావేశంలో రైతులు కోరారు.రైతుల ప్రతిపాదనతోనే చైర్మన్‌ పదవికి పేరు సొసైటీ చైర్మన్,పాలకవర్గ సభ్యులను నామినేటెడ్ పద్ధతిలో ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా సంఘం పరిధిలోని ఐదు గ్రామాల రైతులు సోమశేఖర రావు పేరును స్వచ్ఛందంగా ప్రతిపాదించారని రైతులు తెలిపారు. గతంలో ఆయన సొసైటీ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ రైతులే ఆయన పేరును ముందుకు తీసుకొచ్చారని పేర్కొన్నారు.సోమశేఖర రావు చైర్మన్‌ పదవి కోరుతున్నది 51 ఎంక్వయిరీని ప్రభావితం చేయడానికేననే ఆరోపణలను వారు ఖండించారు.రైతుల అభిమానం, ఆయన అనుభవం, గతంలో చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని చైర్మన్‌ పదవికి ఆయన పేరును ప్రతిపాదిస్తున్న ట్లు స్పష్టం చేశారు.1995కు ముందు సొసైటీ పరిస్థితి ఆ తర్వాత సోమశేఖర రావు హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ఐదు గ్రామాల రైతులకు తెలుసని వారు పేర్కొన్నా రు.రాజకీయ కక్షల కారణంగా సొసైటీ వ్యవహారాలను వివాదాస్పదం చేయవద్దని కోరారు.200 మంది రైతులు పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు.సొసైటీ అభివృద్ధి కోసం సోమశేఖర రావును చైర్మన్‌గా నియమించాలని కోరుతూ సుమారు 200 మంది రైతులు పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని వారు గుర్తుచేశారు.రైతుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు.సోమశేఖర రావుపై విద్యుత్ బిల్లులు,హమాలీ చార్జీలు,రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు తదితర అంశాలకు సంబంధించి సుమారు రూ.92 లక్షల ఆరోపణలు ఉన్నాయని చెబుతున్నారని అయితే ఈ అంశాలపై ఆయనతో ముఖాముఖిగా చర్చించే అవకాశం కల్పించాలని గతంలో కోరినా ఇప్పటివరకు అవకాశం లభించలేదని రైతులు పేర్కొన్నారు.రైతులకు సకాలంలో ఎరువులు అందించడం,ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాటాలు సక్రమంగా నిర్వహించడం,రుణాల ప్రక్రియను సజావుగా కొనసాగించడం వంటి అంశాల్లో సోమశేఖర రావు పనిచేశారని వారు తెలిపారు.పాత కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి అధిష్ఠానం నిర్ణయం మేరకు పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన పాత కార్యకర్తలను గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో పలువురు కోరారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాత కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం అవసరమని పేర్కొన్నారు.రాజకీయ కక్షల కారణంగా ఐదు గ్రామాల రైతులకు అన్యాయం జరిగితే రైతుల తరఫున తీవ్రంగా ప్రతిఘటిస్తామని వారు పేర్కొన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి రైతుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్.తన పదవీకాలంలో ఎలాంటి అవినీతి జరగలేదని సోమశేఖర రావు స్పష్టం చేసినట్లు రైతులు తెలిపారు. సొసైటీ అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తిపై ఆరోపణలు చేయడం కంటే, సంబంధిత ఆరోపణలకు ఆధారాలను బయటపెట్టి వాస్తవాలను రైతుల ముందు ఉంచాలని వారు కోరారు.ఐదు గ్రామాల రైతులు, సంఘ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సొసైటీ చైర్మన్ ఎంపికపై నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో రాజు దేశాయ్,బర్ల గోవిందు,శంకూర్ శంకర్,దశరథ్,శంకర్,బర్ల హనుమంతు,గంగుల స్వామి,అరుణ్ కుమార్,రమేష్, సూరిబాబు,మిర్జాపూర్ సాయన్న,దాదు,మునవర్, కిష్టయ్య,రాజేష్ కన్నా,శ్రీనివాస్,నిజామాబాద్ గంగారం, దండు సాయిబాబా,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.