“అంజుమ్ సుల్తానా”కు అరుదైన గౌరవం..
విద్యారంగ సేవకు ప్రతిభా పురస్కారం..
ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ టీచర్ అంజుమ్ సుల్తానాకు హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలలో అరుదైన గౌరవం లభించింది.గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్,గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ,జయంతి పురస్కరించుకొని విద్యారంగంలో చేస్తున్న నిరుపమాన సేవలకు గాను అంజుమ్ సుల్తానా అబ్దుల్ ఖాదర్ జిలాని దంపతులకు ప్రతిభా అవార్డును అందజేసి ఘనంగా సన్మానించారు.
*సమగ్ర కృషికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు..*
విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, సామాజిక అవగాహన,నాణ్యమైన బోధనకు అంజుమ్ సుల్తానా చేస్తున్న కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచింది. విద్యార్థులను రాష్ట్రస్థాయిలో అనేక పోటీలలో పాల్గొనే విధంగా మార్గదర్శనం వహిస్తూనే మరోపక్క స్టేట్ రిసోర్స్ పర్సన్ గా అంజన్ సుల్తానా రంగానికి విశేష సేవలు అందిస్తోంది.
ఈ వేడుకలలో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

