📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణYadadri Bhuvanagiriవ్యవసాయ మార్కెట్లో వాణిజ్య సముదాయాల ప్రారంభోత్సవం

వ్యవసాయ మార్కెట్లో వాణిజ్య సముదాయాల ప్రారంభోత్సవం

📰 Generate e-Paper Clip

*వ్యవసాయ మార్కెట్లో వాణిజ్య సముదాయాల ప్రారంభోత్సవం…*

*ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02*

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ వ్యవసాయ మార్కెట్‌లో 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన వాణిజ్య సముదాయాల ప్రారంభోత్సవ కార్య క్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని వాణిజ్య సముదాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్లలో మౌలిక వసతులను మెరుగు పరచడంతో పాటు రైతులు , వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడు తోందన్నారు. నూతన వాణిజ్య సముదాయాల ద్వారా వ్యాపారులకు మరింత సౌకర్యవంతమైన వసతులు అందుబాటు లోకి వస్తాయని తెలిపారు.
మార్కెట్‌కు వచ్చే రైతు లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. వలిగొండ వ్యవసాయ మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో ఏఎంసి చైర్మన్ భూక్యా భీమా నాయక్ , పిఎసిఎస్ చైర్మన్ గరిసే రవి , స్థానిక సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డి , ఏఎంసీ పిఎసిఎస్ వైస్ చైర్మన్లు , డైరెక్టర్లు , వలిగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని సహాదేవ్ , ఉప సర్పంచ్ మలుగ మాధవి, మార్కెట్ కమిటీ అధికారులు , ప్రజా ప్రతినిధులు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.