📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకడవెండిలో ఘనంగా నల్ల నర్సింహులు శత జయంతి వేడుకలు

కడవెండిలో ఘనంగా నల్ల నర్సింహులు శత జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

కడవెండిలో ఘనంగా నల్ల నర్సింహులు శత జయంతి వేడుకలు

జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

సర్పంచ్ భాషిపాక రాములు

జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్ల నర్సింహులు శత జయంతి వేడుకలు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

గ్రామంలోని నల్ల నర్సింహులు స్మారక స్తూపం వద్ద గ్రామ సర్పంచ్ భాషిపాక రాములు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా నల్ల నర్సింహులు విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్మారక స్తూపం వద్ద నివాళులర్పించి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ భాషిపాక రాములు మాట్లాడుతూ కడవెండి గడ్డపై పుట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో బ్రిటీష్ వారికి, నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసిన ధీరుడు నల్ల నర్సింహులు అని కొనియాడారు. పేద ప్రజల హక్కుల కోసం, భూమి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

నల్ల నర్సింహులు చూపిన ధైర్య సాహసాలు, త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన జయంతిని ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని గ్రామస్తులు కోరారు.

ఈ కార్యక్రమంలో నల్ల నర్సింహులు కూతురు నల్ల అరుణ, గ్రామ ఉప సర్పంచ్ నక్క రేణుక కొమురయ్య, తాటిపెల్లి మహేష్, దుబ్బాక రత్నాకర్ రెడ్డి, జేరిపోతుల సాయిలు, బిట్ల రామచోక్కం, పెద్ది రవీందర్, ఎండి మజార్ ఫాషా, సుడిగెల హనుమంతు, కాషాబోయిన యాకన్నా, అంజిరెడ్డి, సూలుగురి మహేష్, కడబోయిన స్వామి, పెద్ది అంజలి, కందుల యాకన్నా, అస్నాల కొమురాజీ, పెద్ది సతీష్, భాషిపాక ఎల్లయ్య, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, రైతు సంఘం నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.