డీసీసీ కార్యాలయంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి లకు ఘన నివాళులు
జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02(ప్రజావాణి): గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ల సందర్భంగా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.
ముందుగా స్థానిక మహాత్మా గాంధీ ఘాట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ, వైటిడిఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి, కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, జనగామ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దోర్నాల వెంకటేశ్వర్లు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాన్ని, దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.
అనంతరం డీసీసీ కార్యాలయంలో మహాత్మా గాంధీ మరియు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశానికి వారు అందించిన సేవలను, వారి ఆదర్శాలను స్మరించుకుంటూ, వారు చూపిన సత్యం, అహింస, క్రమశిక్షణ, దేశభక్తి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వేమళ్ళ సత్యనారాయణ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్రమల సుధాకర్, డీసీసీ ఉపాధ్యక్షులు కొత్త కరుణాకర్ రెడ్డి, నూకల బాల్ రెడ్డి, డాక్టర్ రాజమౌళి, డీసీసీ ప్రధాన కార్యదర్శులు జిల్లాల సిద్ధారెడ్డి, ఎం.డి. అన్వర్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు లోకుంట్ల ప్రవీణ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వేముల మల్లేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికే ఇందిరా, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మాజిద్ అప్సర్, సేవాదళ్ అధ్యక్షులు జాయ మల్లేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ కొల్లూరి శివ, వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు మేకల సమ్మయ్య, డీసీసీ కమిటీ సభ్యులు దామర నాగరాజు, లింగాల రాజేందర్ రెడ్డి,
మున్నీ బేగం, వీవర్స్ సెల్ జిల్లా అధ్యక్షులు సామల పరమేశ్వర్, మోర్తాల ప్రభాకర్, సేవాదళ్ ఉపాధ్యక్షులు లింగాల వెంకటరెడ్డి, నల్ల మహేందర్, ఇస్మాయిల్, మచ్చ ప్రవీణ్, బుర్రలు సిద్ధులు, కళ్యాణం సమ్మయ్య, సందీప్, చింతకింది నరేష్, నోముల సోమయ్య, నోముల రాజు, ఉమామహేశ్వరి, సక్కుబాయి, అనిత, క్రాంతి, జీవరత్నం తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
