📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaఆరుతడి పంటలు పండించాలని తెలియజేసిన - పి. మల్లేష్

ఆరుతడి పంటలు పండించాలని తెలియజేసిన – పి. మల్లేష్

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

శుక్రవారం మండల వ్యవసాయ అధికారి పి మల్లేష్ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సిర్దెపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభ లో పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రానున్న యాసంగి సీజన్లో రైతులు ఉన్నటువంటి తక్కువ నీటి వనరులను చాలా జాగ్రత్తగా వాడుకోవాలని. వరి పంటను సాగు చేయకుండా ఉండాలని కోరారు. ఒక కేజీ వరి ధాన్యం పండించడానికి దాదాపు 3000 లీటర్ల నీళ్లు అవసరమవుతాయని ప్రస్తుత ఎలినో ప్రభావం వల్ల వర్షాలు సరిగ్గా కురవలేదని ఎక్కడ కూడా చెరువులు గాని కుంటలు కానీ నిండలేదని దీని ప్రభావం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని తెలిపినారు. రైతు సోదరులు ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో బోరు ఉన్నటువంటి రైతులు ఆరుతడి పంటలైన పెసర్లు, మినుములు, మొక్కజొన్న, జొన్నలు, నువ్వులు, ఆముదాలు, కూరగాయలు పండించుకోవాలని తెలియజేశారు. వీటికి వరి పంటతో పోలిస్తే చాలా తక్కువ నీరు అవసరమవుతాయని తెలియజేశారు. మండలంలో ఇంకా కొంతమంది రైతులు ఫార్మర్స్ రిజిస్ట్రీ చేసుకోలేదని, చేసుకోని రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ సర్పంచ్ దామెర రాములు, వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ సెక్రెటరీ, ఆంజనేయులు, ఇతర రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.