📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్గాంధీ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం.. 50 మంది స్వచ్ఛంద రక్తదానం

గాంధీ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం.. 50 మంది స్వచ్ఛంద రక్తదానం

📰 Generate e-Paper Clip

గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు

దేవరయాంజాల్‌లో వరుసగా 15వ సంవత్సరం రక్తదాన శిబిరం

శామీర్‌పేట్, అక్టోబర్ 2:
జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని శామీర్‌పేట్ డివిజన్ పరిధిలోని దేవరయాంజాల్‌లో కీసర సర్కిల్ తరఫున, వికాస్ మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, యువకులు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం దేవరయాంజాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లైఫ్ సేవ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరుసగా 15వ సంవత్సరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు బీటెక్ సాయికిరణ్ గౌడ్, సభ్యులు పి. రాజశేఖర్ గౌడ్, జి. శ్రీనివాస్ రెడ్డి, ఎస్. కరుణాకర్ రెడ్డి, టీ. ప్రవీణ్, జే. వెంకటేశ్, ఎస్. నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో శిబిరం కొనసాగింది.

కార్యక్రమానికి హాజరైన నాయకులు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. శిబిరంలో సుమారు 50 మంది రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ బి. జైపాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పి. మహిపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోల్డ్ శ్రీనివాస్, జాతీయ కళామండలి అధ్యక్షులు ఎన్.వై. అశోక్, మాజీ కౌన్సిలర్ పి. నర్సింగ్ రావు గౌడ్, మాజీ వార్డు సభ్యులు డి. ప్రకాష్ గౌడ్, రామాలయం మాజీ చైర్మన్ పి. లక్ష్మీనారాయణ, మాజీ ధర్మకర్తలు పి. నర్సింహారెడ్డి, బి. శ్రీనివాస్, డి. రాజమోహన్, నాయకులు ఆర్. నాగరాజ్ గౌడ్, వి. నర్సింహారెడ్డి, పుర ప్రముఖులు డి. శ్రీరాములు గౌడ్, పి. ఆనంద్, డి. శ్రీనివాస్ గౌడ్, డి. విజయ్ కుమార్, వికాస్ మండలి సభ్యులు యు. ప్రవీణ్ కుమార్, ఎం. శ్రీపాల్ గౌడ్, టీ. అరుణ్, సూపర్‌వైజర్ ఎం. ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

మహాత్మాగాంధీ చూపిన అహింస, సత్యం, సేవా మార్గాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ వరుసగా 15వ సంవత్సరం సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న లైఫ్ సేవ్ ఆర్గనైజేషన్ సభ్యులను వారు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.