కాటారంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
కాటారం: అక్టోబర్ 2 మన ప్రజావాణి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాటారం మండల అంబేద్కర్ కూడలి వద్ద మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ ప్రజలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ప్రజా అభిమానులు, ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

