📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamఅక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం

అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం

📰 Generate e-Paper Clip

అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

*నిబంధనలు ఉల్లంఘించి ఖనిజాలు కొనుగోలు చేస్తే లైసెన్సుల అవకాశాలు రద్దు*

*వెలుగుమట్ల ప్రాంతంలో అక్రమ మైనింగ్ పై తనిఖీలకు ఆదేశించిన జిల్లా కలెక్టర్*

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

అక్రమ మైనింగ్ ను సహించేది లేదని, ఉక్కుపాదం మోపి, కఠిన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో అన్నారు.

ఖమ్మం సమీపంలోని వెలుగుమట్ల ప్రాంతంలో అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం, రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యుల ఆదేశానుసారం రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులచే ఉమ్మడిగా తనిఖీలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.

వెలుగుమట్ల పార్కు సమీపంలోని ప్రైవేట్ వెంచర్ పట్టా భూముల్లో స్థానికంగా కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా బరైటీస్ ఖనిజాన్ని తవ్వుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. చిన్న చిన్న గుంతలు తీసి, లభించిన బోల్డర్లను పగలగొట్టి (చిప్పింగ్ చేసి) ట్రాక్టర్ల ద్వారా పక్కనే ఉన్న మినరల్ డీలర్లకు అమ్ముతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని కలెక్టర్ అన్నారు.

మైనింగ్ అధికారులు, ఖమ్మం అర్బన్ మండల తహశీల్దార్ తో కలసి అక్రమ రవాణా జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి, తవ్వకాల కొలతలను నమోదు చేసుకున్నారని, ఈ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న పట్టాదారులను, బాధ్యులను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేసినట్లు తెలిపారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారిపై నోటీసులు జారీ చేసి, భారీగా పెనాల్టీలు విధించనున్నట్లు, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఖనిజాన్ని కొనుగోలు చేసే మినరల్ డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆ ప్రకటనలో హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.