📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonతెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం - కరపత్రం ఆవిష్కరణ

తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం – కరపత్రం ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం – కరపత్రం ఆవిష్కరణ

జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02(ప్రజావాణి): ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో అక్టోబర్ 4న, ఆదివారం ఉదయం 10:30 గంటలకు జనగామ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులోని శ్రీనివాస హోండా పైన గల గ్లోరీ ఫంక్షన్ హాల్ లో “సుదీర్ఘ సమాలోచన చర్చా వేదిక” కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

గురువారం జనగామలో పూర్వ జేఏసీ నాయకులు, తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం సమన్వయకర్త కన్నా పరశురాములు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫోరం సమన్వయకర్తలు ధారావత్ ప్రేమ్ చంద్ నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు ధారావత్ శంకర్ నాయక్, సీతారాం, కోటా రంగయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కన్నా పరశురాములు గారు మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, ప్రజల భాగస్వామ్యం, ప్రజా సమస్యల పరిష్కారం, జవాబుదారీతనంతో కూడిన పాలన, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.

కుల, మత, ప్రాంత, వర్గ భేదాలకు అతీతంగా ప్రజలందరినీ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములను చేయడం, అణగారిన వర్గాల హక్కులకు ప్రాధాన్యం కల్పించడం, ప్రజా ప్రయోజనాలను కేంద్రంగా చేసుకుని ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనలను చర్చించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ సమాలోచన కార్యక్రమానికి వక్తలుగా సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, తొలి వెలుగు రఘు, తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్విరాజ్ , రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ , ఫోరం సలహాదారులు రేపల్లె నరోత్తమ సూరి , జై సింగ్ రాథోడ్ , సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంగోతు రాంబాబు నాయక్ హాజరుకానున్నట్లు తెలిపారు.

మేధావులు, సామాజిక కార్యకర్తలు, యువత, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.