📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపుట్టపహాడ్ గ్రామంలో గాంధీ జయంతి వేళ పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

పుట్టపహాడ్ గ్రామంలో గాంధీ జయంతి వేళ పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

పుట్టపహాడ్ గ్రామంలో గాంధీ జయంతి వేళ పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం. శానిటేషన్ కిట్లు, నూతన వస్త్రాల పంపిణీ.

పరిగి, అక్టోబర్02(ప్రజావాణి):

వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్ర పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామ పంచాయతీ పరిధిలో నిరంతరం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సర్పంచ్ బోయిని అంజిలయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులకు శానిటేషన్ కిట్లు, నూతన వస్త్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బోయిని అంజిలయ్య మాట్లాడుతూ— గ్రామం పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండటంలో పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎనలేనిదని కొనియాడారు. వారి నిస్వార్థ సేవలకు గుర్తింపుగా, ఉడుత భక్తిగా ఈ చిన్న సత్కారాన్ని నిర్వహిస్తున్నామని, సమాజంలో వారు చేస్తున్న పని ఎంతో గొప్పదని ప్రశంసించారు. కార్మికుల సంక్షేమానికి పంచాయతీ పాలకవర్గం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లాల్ బహదూర్ శాస్త్రి, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, వార్డు సభ్యులు శిరీష, డి. ఎల్లమ్మ, బి. భిక్షపతి, ఎస్. మారుతి, సి. అశ్విని రవి, సి. వెంకట్రాములు, జె. రఘురాములు పాల్గొన్నారు. అలాగే లైన్‌మెన్ శ్రీరాములు, గ్రామ పెద్దలు యాదిరెడ్డి, హరినాథ్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, యు. వెంకట్రాములు, టి. బుగ్గయ్య, వెంకటయ్య, బి. గోపాల్ , తదితరులు పాల్గొని పారిశుద్ధ్య కార్మికులను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.