📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆర్‌టిఐ కమిటీ సభ్యుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ

ఆర్‌టిఐ కమిటీ సభ్యుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ

📰 Generate e-Paper Clip

ఆర్‌టిఐ కమిటీ సభ్యుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మన ప్రజావాణి
మంచిర్యాల జిల్లా
అక్టోబర్ 02

సమాచార హక్కు చట్టం–2005ను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడం, సమాచార హక్కు చట్టం అమలుకు సంబంధించి జిల్లా స్థాయిలో సమన్వయం, పర్యవేక్షణ, అమలు ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీలో ఇద్దరు ఆర్‌టిఐ కార్యకర్తలను నామినేషన్ రోటేషన్ పద్ధతిలో సభ్యులుగా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాకు చెందిన ఆసక్తి, అర్హత కలిగిన ఆర్‌టిఐ కార్యకర్తలు జిల్లా స్థాయి సమన్వయ కమిటీలో సభ్యులుగా సేవలందించేందుకు తమ దరఖాస్తులను ప్రజా సమాచార అధికారి / జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా కలెక్టర్ కార్యాలయం, మంచిర్యాలలో ఈ నెల 6వ తేదీ లోగా వ్యక్తిగతంగా సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, సూచనలకు అనుగుణంగా ఇద్దరు ఆర్‌టిఐ కార్యకర్తలను కమిటీ సభ్యులుగా నామినేట్ చేయడం జరుగుతుందని, జిల్లాలోని ఆర్‌టిఐ కార్యకర్తలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.