📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్గాంధీ జయంతి రోజున పోరుమామిళ్లలో యథేచ్ఛగా మద్యం విక్రయాలు: నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైన్ షాపులు,...

గాంధీ జయంతి రోజున పోరుమామిళ్లలో యథేచ్ఛగా మద్యం విక్రయాలు: నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైన్ షాపులు, అధికారుల నిమ్మకు నీరెత్తిన వైఖరి!

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల పట్టణంలో అక్టోబర్2ప్రజావాణి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పవిత్రంగా పాటించాల్సిన జాతీయ డ్రై డే నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కబడ్డాయి.సత్యం,అహింస,మద్యపాన రహిత సమాజమే ధ్యేయంగా జీవించిన ఆ మహనీయుని పుట్టినరోజున, ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయకుండా కొందరు స్వార్థపరులు యథేచ్ఛగా మద్యం విక్రయాలు సాగించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఈ పర్వదినాన పోరుమామిళ్ల టౌన్‌లో మద్యం ఏరులై పారడం పట్ల ప్రజలు, ముఖ్యంగా మహిళా లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.

నిబంధనలు కాగితాలకే పరిమితం.. తెరవెనుక నల్లబజారు దందా!

చట్టప్రకారం అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా ఎక్కడా మద్యం షాపులు, బార్లు, క్లబ్బులు తెరవడానికి వీల్లేదు. ఇది ప్రభుత్వ ఉత్తర్వు మాత్రమే కాదు, జాతిపితకు దేశం అర్పించే కనీస గౌరవం.కానీ, పోరుమామిళ్ల కేంద్రంలో మద్యం వ్యాపారులు లాభార్జనే ధ్యేయంగా పెట్టుకుని చట్టాన్ని అపహాస్యం చేశారు.ముందు బోర్డులు.వెనుక అమ్మకాలు: ప్రధాన ద్వారాలకు తాళాలు వేసినట్లు చూపిస్తూ, వెనుక దారుల ద్వారా,గుట్టుచప్పుడు కాకుండా కస్టమర్లను లోపలికి పిలిపించి మద్యం బాటిళ్లను అప్పగిస్తున్నారు.బెల్ట్ షాపులకు ముమ్మర సరఫరా పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న బెల్ట్ షాపులకు ముందురోజు రాత్రే కాకుండా,ఈరోజు కూడా రహస్యంగా స్టాక్ తరలించి విక్రయాలు జరిపారు.అడ్డగోలు దోపిడీ: డ్రై డే కావడంతో మద్యం దొరకడమే గగనమన్నట్లు సృష్టించి,ప్రతి బ్రాండ్ బాటిల్‌పై రూ.10 నుండి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పెట్టారు.

గాంధీజీ సిద్ధాంతాలకు తీవ్ర అవమానం

మహాతీ గాంధీ జీవితాంతం మద్యపాన మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడారు.మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని,మహిళల జీవితాలు అంధకారమవుతున్నాయని ఆవేదన చెంది,మద్యపాన నిషేధాన్ని ఒక ఉద్యమంగా నడిపారు. అలాంటి మహనీయుని సిద్ధాంతాలను,ఆదర్శాలను గౌరవించాల్సిన రోజునే,పోరుమామిళ్లలో వైన్ షాపులు తెరిచి ఉంచడం సత్యం,అహింస అనే పదాల పవిత్రతనే నీరుగార్చడమేనని స్థానిక మేధావులు,విద్యావంతులు మండిపడుతున్నారు.పట్టణంలో ఇంత బహిరంగంగా ఉల్లంఘనలు జరుగుతున్నా,ప్రత్యేక నిఘా ఉంచాల్సిన ఎక్సైజ్ శాఖ మరియు స్థానిక పోలీస్ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత కలిగిన అధికారులు కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ప్రజలు అనుమానిస్తున్నారు.మద్యం సిండికేట్ ప్రతినిధులతో అధికారులకు ఉన్న లోపాయికారీ ఒప్పందాల వల్లే ఈ అక్రమ దందా సాగుతోందని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

చర్యలు తీసుకునేది ఎప్పుడు? సమాజం వేచి చూస్తోంది!

పవిత్రమైన జాతీయ పండుగ రోజున చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని,నిబంధనలను బేఖాతరు చేసిన మద్యం దుకాణాల నిర్వాహకులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఊపందుకుంది.ఈ విక్రయాలపై సమగ్ర విచారణ జరిపి,సదరు వైన్ షాపుల లైసెన్సులను తక్షణమే రద్దు చేయాలని స్థానిక మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.అలాగే విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన స్థానిక అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.ఈ అక్రమ విక్రయాల ఉదంతంపై జిల్లా ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో,బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.