📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగాంధీ–శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా

గాంధీ–శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా

📰 Generate e-Paper Clip

గాంధీ–శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా

దేశ సేవలో మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం

స్వాతంత్ర్య సమరంలో గాంధీ, శాస్త్రిల సేవలను కొనియాడిన బీజేపీ నాయకులు

కూకట్‌పల్లి: అక్టోబర్ 2 (ప్రజావాణి)
జాతిపిత మహాత్మా గాంధీ, దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు కూకట్‌పల్లి 249వ డివిజన్ బీజేపీ క్యాంప్ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు పి. దుర్గా ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాటం, లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. దేశం కోసం వారు చేసిన త్యాగాలు, సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకురాలు కృష్ణప్రియ చక్రవర్తి, డివిజన్ సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి, వినయ్ కుమార్, పనింద్ర శర్మ, రామకృష్ణ చారి, ప్రశాంత రావు, శేఖర్ రావు, కొడిచెర్ల రాఘవేందర్, కొమ్ము ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.