గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేద్దాం
గాంధీ జయంతి వేడుకల్లో సాలకాపూర్ గ్రామ సర్పంచ్ గడిపే మౌనిక అనిల్ కుమార్
మద్దూరు అక్టోబర్2, ప్రజా వాణి,
మండలంలోని సాలకాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో 157 వ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు గ్రామ సర్పంచ్ గడిపే మౌనిక అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం ఆమే మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేద్దాం అన్నారు. గాంధీజీ చూపిన శాంతి, సామాజిక చైతన్యంతో పాటు గ్రామాలలో పరిశుభ్రత,పాటించడం వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శెట్టే ఐలయ్య, వార్డు సభ్యులు ఎర్రం సోనియా,నిమ్మల మౌనిక, గడిపే నిర్మల, పెంతల బాల్ రెడ్డి, కడకంచి యాదగిరి, ఏ ఎన్ ఏం కవిత, ఆశా,అంగన్వాడి కార్యకర్తలు, మహిళ సంఘాల ప్రతినిధులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

