📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamఆర్టీఐ యాక్టివిస్ట్ సొసైటీ జిల్లా అధ్యక్షుడిగా తాళ్లూరి నరసింహారావు

ఆర్టీఐ యాక్టివిస్ట్ సొసైటీ జిల్లా అధ్యక్షుడిగా తాళ్లూరి నరసింహారావు

📰 Generate e-Paper Clip

ఆర్టీఐ యాక్టివిస్ట్ సొసైటీ జిల్లా అధ్యక్షుడిగా తాళ్లూరి నరసింహారావు

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

సమాచార హక్కు చట్టం–2005 యాక్టివిస్ట్ సొసైటీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా తాళ్లూరి నరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం–2005 యాక్టివిస్ట్ సొసైటీ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్ చేతుల మీదుగా తాళ్లూరి నరసింహారావుకు ఐడీ కార్డు అందజేశారు.
ఈ సందర్భంగా తాళ్లూరి నరసింహారావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను తూచా తప్పకుండా నిర్వర్తిస్తానని తెలిపారు. సమాచార హక్కు చట్టం–2005 ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న హక్కులను వివరించడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. సంస్థ లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు నూతన జిల్లా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.