📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaచండూరులో అలిమ్కో ఆధ్వర్యంలో గుర్తింపు శిబిరం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు

చండూరులో అలిమ్కో ఆధ్వర్యంలో గుర్తింపు శిబిరం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు

📰 Generate e-Paper Clip

దివ్యాంగులకు ఉచితంగా సహాయ ఉపకరణాలు

చండూరులో అలిమ్కో ఆధ్వర్యంలో గుర్తింపు శిబిరం

ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అలిమ్కో (ALIMCO)-హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉచిత సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు తెలిపారు. గురువారం చండూరు పట్టణంలోని కస్తాల రోడ్డులో ఉన్న భారతి చంద్ర గార్డెన్‌లో నిర్వహించిన ఈ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి దివ్యాంగుడు ప్రభుత్వ పథకాలను, సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరంలో వైద్య నిపుణులు దివ్యాంగులను పరీక్షించి, వారి వైకల్య శాతానికి అనుగుణంగా అవసరమైన సాధనాలను నిర్ణయించి దరఖాస్తులను స్వీకరించారు. ఈ శిబిరం ద్వారా అర్హులైన దివ్యాంగులకు త్వరలోనే బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, శ్రవణ యంత్రాలు (చెవిటి మిషన్లు), చంక కర్రలు, చూపు లేని వారి కోసం బ్రెయిలీ కిట్లు, స్మార్ట్ కేన్‌లు (వాకింగ్ స్టిక్స్) తదితర పరికరాలను ఉచితంగా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు ఎస్.కె. ఖలీల్‌తో పాటు స్థానిక నాయకులు, వివిధ వార్డుల ప్రజలు, పెద్ద సంఖ్యలో దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.