📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచేర్యాల అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయించాలి

చేర్యాల అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయించాలి

📰 Generate e-Paper Clip

చేర్యాల అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయించాలి –

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

-53 గ్రామాలకు ఒక్కో గ్రామానికి రూ.5 లక్షలు కేటాయించాలి

-చెరువులు నిండే వరకు నీటిని విడుదల చేయాలి
సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి జాప్యం ఉండకూడదు

-అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించాలి

-మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు

జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం
చేర్యాల ప్రాంత అభివృద్ధికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ నిధులను కేటాయించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. చేర్యాల పరిధిలోని 53 గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ఒక్కో గ్రామానికి రూ.5 లక్షల చొప్పున నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

చేర్యాల పట్టణంలోని రేణుక గార్డెన్ లో గురువారం చేర్యాల పట్టణంతో పాటు చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాలకు చెందిన మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులు, మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఎలాంటి జాప్యం లేకుండా అందించాలన్నదే తన ఉద్దేశమన్నారు. ఏ మండలానికి సంబంధించిన పథకాల పంపిణీని ఆ మండలంలోనే నిర్వహిస్తే లబ్ధిదారులకు మరింత సౌకర్యంగా ఉంటుందని సూచించారు.

చేర్యాల ప్రాంత ప్రజలు ఎంతో ప్రేమాభిమానాలతో ఉంటారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. చేర్యాల పరిధిలోని 53 గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ఎంపీ నిధుల నుంచి ఒక్కో గ్రామానికి రూ.5 లక్షల చొప్పున కేటాయించాలని కోరారు.

కల్యాణలక్ష్మి చెక్కుల విషయంలో తాను ఎలాంటి ఆలస్యం చేయడం లేదని పల్లా స్పష్టం చేశారు. తాను ఎక్కడ కార్యక్రమానికి వెళ్లినా లబ్ధిదారుల చెక్కులపై సంతకాలు చేసి అందిస్తున్నానన్నారు. అధికారులు కూడా లబ్ధిదారుల ఫైళ్లను ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

చేర్యాల, తపాస్ పల్లి, బచ్చన్నపేట, నాగపురి తదితర ప్రాంతాల్లోని చెరువులు పూర్తిగా నిండే వరకు నిరంతరం నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని పల్లా గారు కోరారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు, కలెక్టర్ తో మాట్లాడి చెరువులకు నీరు అందేలా చూడాలని ఎంపీని విజ్ఞప్తి చేశారు. రాబోయే పంట కాలంలో నార్లు పోసుకునేందుకు రైతులకు ఈ నీరు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక చేయూతతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని పల్లా గారు అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.