*ప్రిన్సిపాల్ చెప్పే ఏకపక్ష నివేదికను
సమర్థిస్తున్న తీరు*
*మీడియా ప్రతినిధులు ఆధారాలు చూపెట్టిన ప్రిన్సిపాల్ కి సపోర్ట్ చేస్తున్న వైనం*
*ఘటనలపై ఆధారాలు అడిగితే, నేను మహిళా అధికారిని అని జర్నలిస్టులను బెదిరించిన డి సి ఓ*
*జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఉంటేనే, నా దగ్గరికి రావాలని భూకాయింపు*
*పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించిన డిసిఓపై జిల్లా కలెక్టర్ స్పందించాలి*
తొర్రూర్
అక్టోబర్ 1
తొర్రూరు పట్టణ కేంద్రంలో జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల వరుస ఘటనలతో అట్టుడుకుతుంది. ఈ ఘటనలపై విచారణకు వచ్చిన డిసిఒ తూతూ మంత్రంగా విచారణ చేపట్టి ప్రిన్సిపాల్ కి సపోర్ట్ చేసే విధంగా మాట్లాడి, అధికార దుర్వినియోగానికి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవాలను డిసిఒ ముందు ఉంచిన మీడియా ప్రతినిధులపై నేను మహిళను అంటూ, బెదిరింపులకు గురి చేయడం హాట్ టాపిక్ గా మారింది. వరుసగా జరిగే ఘటనలకు గేట్ వాచ్మెన్ కారణమని, ప్రిన్సిపాల్ కాదని చెప్పడం, వెనుక ఆంతర్యం ఏంటని జిల్లా కలెక్టర్ డి సి ఓ పై విచారణ చేయాల్సి ఉంది. ఘటనకు గురైన విద్యార్థి తల్లిదండ్రుల నుండి గాని ఎలాంటి సమాచారాన్ని సేకరించకుండా, ప్రిన్సిపాల్ తయారుచేసిన తప్పుడు నివేదికలను సమర్థిస్తూ, మీడియాకు అనుమతి ఎవరిచ్చారు కలెక్టరిస్తేనే నన్ను కలవాలి అంటూ, తన ఇష్టానుసారమైన రీతిలో అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈ అధికారి బాధ్యత ఏ విధంగా ఉందో, అధికార యంత్రాంగం విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ పాఠశాలలో ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న వ్యక్తి పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులను కూడా బెదిరిస్తూ, తన తప్పును దాచుకోవడం కోసం రాతపూర్వకంగా సంతకాలు చేసుకొని, మంచి వాడిలాగా చలామణి కావడం విశేషం. అదేవిధంగా గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో గణపతిని ఏర్పాటు చేసి పిల్లల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసి జేబులు నింపుకున్నట్టు ఆరోపణలు కూడా ప్రిన్సిపాల్ మీద లేకపోలేదు. విద్యార్థులకు వేడి నీరును తయారు చేసే యంత్రాన్ని తీసుకురావడానికి పిల్లల తల్లిదండ్రుల నుంచి తను ఇష్టానుసారమైన, వసూళ్లకు పాల్పడి , తానేదో జేబుల నుండి డబ్బులు పెట్టుకున్నట్లు అధికారులను తప్పుదోవ పట్టిస్తూ, దొంగే దొంగ అన్న చందంగా, ప్రిన్సిపాల్ వివరిస్తున్నారని ఇతనిపై ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా 2015 నుండి ఈ ప్రాంతంలో ప్రవేటు పాఠశాలను ఏర్పాటు చేసుకొని ప్రస్తుతం కూడా కొనసాగిస్తూ, స్థానిక బలాన్ని పెంపొందించుకొని, పాఠశాల విద్యార్థులను కొంతమందిని, తన గుప్పిట్లో పెట్టుకొని ఉపాధ్యాయులను మనమంతా ఒక్కటి, ఎవరు ఒకరు నిజం చెప్పినా అందరూ నష్టపోతామని, ప్రబోధిస్తున్న ప్రబుద్ధుడు ప్రిన్సిపాల్ ఏ కావడం హాస్యస్పదంగా మారింది.
*వాచ్మెన్ బాధ్యులుగా చేస్తున్నారు ప్రిన్సిపాల్ బాధ్యతలు ఏంటి మీడియా ప్రశ్న*
వాచ్మెన్ పాఠశాలలో జరిగే వరుస ఘటనలకు, కారణమని ప్రిన్సిపాల్ చెప్పిన మాటలనే డిసిఒ చెప్పడం వెనుక, ఆంతర్యం ఏమిటని, ప్రశ్నగా మిగిలిపోయింది. డి సి ఓ తను మహిళలని మీడియా ప్రతినిధులను బెదిరించడం, ప్రిన్సిపాల్ ఏ కరెక్ట్ అని వాదించడం డిసిఓ ఏకపక్ష నిర్ణయాలు చేయడం, వెనుక అధికార యంత్రాంగం క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంది. అదే కాకుండా జిల్లా కలెక్టర్ విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పరిచి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ వరుస ఘటనల వెనుక, బాధ్యులెవరు గుర్తించాల్సి ఉంది. ఈ అంశంపై డి సి ఓ తీరుపై జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే?

