📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్తాడేపల్లిలో రాజకీయ సందడి: వైఎస్ జగన్, సజ్జలతో కడప జిల్లా సీనియర్ నేత పోతిరెడ్డి నాగార్జున...

తాడేపల్లిలో రాజకీయ సందడి: వైఎస్ జగన్, సజ్జలతో కడప జిల్లా సీనియర్ నేత పోతిరెడ్డి నాగార్జున రెడ్డి కీలక భేటీ!

📰 Generate e-Paper Clip

తాడేపల్లి విజయవాడ)అక్టోబర్ 1 ప్రజావాణి రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు,కడప జిల్లా పోరుమామిళ్ల ప్రముఖ వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీ పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కడప జిల్లాలో పార్టీ బలోపేతం,భవిష్యత్తు కార్యాచరణపై వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు సాగాయి.ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘ చర్చ:

ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి,తో పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ప్రస్తుత రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేడర్‌ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రజా పక్షాన పోరాటాలు ఉధృతం చేయడంపై అధినేత జగన్ నాగార్జున రెడ్డి కి కీలక దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా వైఎస్సార్ కుటుంబానికి మొదటి నుండి అండగా నిలిచిన కడప జిల్లా, పోరుమామిళ్ల ప్రాంతంలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు.ఈ సందర్భంగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ముందుకు సాగుతుందని, నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీ అభివృద్ధికి శ్రమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రత్యేక భేటీ:

వైఎస్ జగన్మోహన్ రెడ్డి,తో సమావేశం అనంతరం, పోతిరెడ్డి నాగార్జున రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రీజినల్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి తో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, జిల్లాల్లో కేడర్‌ను సమన్వయం చేసుకునే వ్యూహాలపై వీరిద్దరి మధ్య గంభీరమైన చర్చ జరిగింది. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపైన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజలతో నిరంతరం మమేకమై పోరాటాలు చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన పోతిరెడ్డి నాగార్జున రెడ్డి గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సలహాదారు పదవితో పాటు, టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా, మైదుకూరు నియోజకవర్గ పరిధిలో ఎంపీపీగా, జెడ్పీటీసీగా సేవలందించిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకులు.తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన అధినేత జగన్ మోహన్ రెడ్డి తోను, సజ్జల రామకృష్ణారెడ్డి తోను జరిపిన ఈ వరుస భేటీలు పోరుమామిళ్ల ప్రాంతంతో పాటు, కడప జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.