📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవీబీ-జీ రాంజీ గ్రామాభివృద్ధి ప్రణాళిక

వీబీ-జీ రాంజీ గ్రామాభివృద్ధి ప్రణాళిక

📰 Generate e-Paper Clip

*వీబీ-జీ రాంజీ గ్రామాభివృద్ధి ప్రణాళిక*

రాయికల్; అక్టోబర్ 01 (ప్రజావాణి)

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన నూతన వీబీ-జీ రాంజీ (వికసిత్ భారత్ -గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్) పథకం అమలులో భాగంగా రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామ పంచాయతీలో గురువారం వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక (VGPP) తయారీ ప్రక్రియను సర్పంచ్ గుర్రం భావన-మహేందర్ గౌడ్, ఎంపీడీవో బింగి చిరంజీవి ల ఆధ్వర్యంలో ప్రారంభించారు.గ్రామ పంచాయతీ ఆవరణంలో గ్రామస్తులతో కలిసి రిసోర్స్ మ్యాప్ గీశారు. గ్రామంలోని సహజ వనరులు,నీటి వనరులు,చెరువులు, రోడ్లు,ప్రభుత్వ భవనాలను గుర్తించారు.ఈ సందర్భంగా సర్పంచ్ గుర్రం భావన మాట్లాడుతూ వీబీ-జీ రాంజీ పథకం ద్వారా మన గ్రామానికి అవసరమైన పనులను మనమే గుర్తించి, గ్రామసభలో ఆమోదించుకుని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని,ప్రతి ఒక్కరూ తమ సూచనలు ఇవ్వాలని,పారదర్శకంగా పనులు జరిగేలా చూస్తామని అన్నారు.అనంతం ఎంపీడీఓ బింగి చిరంజీవి మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీ 3 నుండి 5 ఏళ్లకు శాచురేషన్ ప్లాన్ తయారు చేసుకోవాలని,గ్రామసభ ఆమోదించిన పనులకే ప్రాధాన్యత ఉంటుందని,అన్ని పనులు యుక్తధార పోర్టల్ లో జియో ట్యాగింగ్ నమోదు చేసి చేస్తారని అన్నారు. నీటి భద్రత, మౌలిక సదుపాయాలు, జీవనోపాధి,వాతావరణ విపత్తుల నివారణ అనే నాలుగు అంశాల కింద చేపట్టాల్సిన పనులను గుర్తించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్, ఏపీవో దివ్య, టెక్నికల్ అసిస్టెంట్ విజయ్, పంచాయతీ కార్యదర్శి ఆదిత్య రాజ్, ఫీల్డ్ అసిస్టెంట్లు, కారోబార్ రామస్వామి, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.