📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజేజేసీ జనగామలో ఘనంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం

జేజేసీ జనగామలో ఘనంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం

📰 Generate e-Paper Clip

*జేజేసీ జనగామలో ఘనంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం*

-ఎస్బీఐ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రతిభ చేతుల మీదుగా ప్రారంభం
-పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత – విద్యార్థులకు అవగాహన
-జీజేసీ కళాశాల ఆవరణాన్ని శుభ్రం చేసిన విద్యార్థులు

జనగామ జిల్లా ప్రతినిధి , అక్టోబర్ 01 (ప్రజావాణి):
స్వచ్ఛ భారత్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా హి సేవా – 2026 కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (జీజేసీ), ధర్మకంచ, జనగామ నందు స్వచ్ఛతా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), మున్సిపాల్ జనగామ బ్రాంచ్ ఆధ్వర్యంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (LDM) ప్రతిభ ప్రారంభించారు.

పరిశుభ్రతే ఆరోగ్యకర భవిష్యత్తుకు మార్గం:

ఈ సందర్భంగా ఎల్‌డీఎం ప్రతిభ మాట్లాడుతూ… “పరిసరాల పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన వాతావరణం ఉంటేనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉంటుంది. ప్రతి విద్యార్థి తమ ఇంటి నుంచే పరిశుభ్రతను పాటించాలి. స్వచ్ఛతా హి సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.

అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి మాట్లాడుతూ విద్యార్థులకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మరిపెల్ల రవి ప్రసాద్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, తడి-పొడి చెత్తను వేరు చేయాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

అనంతరం కళాశాల ఆవరణంలో విద్యార్థులు, అధ్యాపకులు కలిసి శ్రమదానం చేశారు. కళాశాల తరగతి గదులు, గ్రౌండ్, పరిసరాలను శుభ్రం చేశారు.

ఈ కార్యక్రమంలో జనగామ సీఎఫ్ఎల్ స్టాఫ్ కౌన్సిలర్లు అనిల్ గౌడ్ ఉదయ , రఘు, కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.