📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణ3వ వార్డులో చెత్త వాహనం ప్రారంభం – పరిశుభ్రతపై కౌన్సిలర్ అవగాహన

3వ వార్డులో చెత్త వాహనం ప్రారంభం – పరిశుభ్రతపై కౌన్సిలర్ అవగాహన

📰 Generate e-Paper Clip

*3వ వార్డులో చెత్త వాహనం ప్రారంభం – పరిశుభ్రతపై కౌన్సిలర్ అవగాహన*

– పారిశుధ్య నిర్వహణ మెరుగు కోసం నూతన చెత్త వాహనం ప్రారంభం
– తడి-పొడి చెత్త వేరు చేయాలని కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి పిలుపు
– వార్డును స్వచ్ఛంగా ఉంచాలంటే ప్రజల సహకారం తప్పనిసరి

జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01 (ప్రజావాణి):
జనగామ మున్సిపాలిటీ 3వ వార్డులో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు మున్సిపాలిటీ ద్వారా నూతనంగా కేటాయించిన చెత్త సేకరణ వాహనాన్ని వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి గురువారం ఘనంగా జెండా ఊపి ప్రారంభించారు.

తడి, పొడి చెత్త వేరు చేయాలి:
ఈ సందర్భంగా కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి గారు మాట్లాడుతూ… “వార్డు ప్రజలు ప్రతిరోజూ తమ ఇళ్లలో తయారైన తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా చేసి వాహన సిబ్బందికి అందించాలి. ప్రతి ఇంటి నుంచి చెత్తను క్రమం తప్పకుండా సేకరిస్తాం. ఎవరూ రోడ్లపై చెత్త వేయొద్దు” అని కోరారు.

“ఇళ్లలో వాడిన చెత్తను, మురికి బట్టలను, ప్లాస్టిక్ డబ్బాలను, కవర్లను, పాడైపోయిన మిగిలిన ఆహారాన్ని రోడ్లపై, డ్రైనేజీ కాలువల్లో, ఖాళీ స్థలాల్లో పడేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. దీంతో ఆహారం కోసం కోతులు, కుక్కలు వార్డులో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రజలను, చిన్నారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. డ్రైనేజీలు మూసుకుపోయి దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు.

పరిశుభ్రత మనందరి బాధ్యత:

“పరిసరాల పరిశుభ్రత అనేది కేవలం మున్సిపాలిటీ బాధ్యత మాత్రమే కాదు, మనందరి ఉమ్మడి బాధ్యత. వార్డును స్వచ్ఛంగా, అందంగా, ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి వార్డు ప్రజలందరూ పారిశుధ్య సిబ్బందికి, మున్సిపాలిటీకి సహకరించాలి. మన వార్డును జిల్లాలోనే ఆదర్శ వార్డుగా నిలపాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి” అని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోటా నాయక్, కాంగ్రెస్ పట్టణ నాయకులు మచ్చ ప్రవీణ్, వార్డు అధ్యక్షులు దామోదర్ రెడ్డి, సీనియర్ నాయకులు గజ్జల సుదర్శన్ రెడ్డి, దామెర నాగరాజు, మార్తాల ప్రభాకర్, బెలీదే, సీపీఎం శాఖ కార్యదర్శి గుండు శశిరేఖ, బత్తిని నరసింహులు, ఎండి నజీమా, టీఆర్ఎస్ నాయకులు అంబటి రాజయ్య, కాంటూరు అంజయ్య, వార్డు ఆఫీసర్ నిఖిల్ రెడ్డి, ఆర్పీ దుంబాల రేవతి, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.