📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజర్నలిస్టుల హక్కుల కోసం సమరశంఖం

జర్నలిస్టుల హక్కుల కోసం సమరశంఖం

📰 Generate e-Paper Clip

*జర్నలిస్టుల హక్కుల కోసం సమరశంఖం!*

*అక్టోబర్‌ 2న దేశవ్యాప్తంగా నిరసనలు..

*సంగారెడ్డిలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు*

పటాన్చెరు, అక్టోబర్ 1 (ప్రజావాణి): జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం భారతీయ జర్నలిస్టుల సమాఖ్య పిలుపు మేరకు అక్టోబర్‌ 2న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విజయవంతం చేయాలని తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు కే. విరహత్‌ అలీ, ప్రధాన కార్యదర్శి రామనారాయణ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం అక్టోబర్‌ 2న నిర్వహించే నిరసన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాలోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.
జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అక్టోబర్‌ 2న సంగారెడ్డి జిల్లాలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఏ.కె. ఫైసల్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు.
జిల్లా అధ్యక్షుడు బి. యాదగిరి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అనిల్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టులందరూ ఐక్యంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.