📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవనభోజనాల్లో కోలాటాల సందడి.. సుఖసంతోషాలతో కేరింతలు!

వనభోజనాల్లో కోలాటాల సందడి.. సుఖసంతోషాలతో కేరింతలు!

📰 Generate e-Paper Clip

రేగొండ మండల రిపోర్టర్ అక్టోబర్ అక్టోబర్01 మన మన ప్రజావా:-పచ్చని చెట్ల నీడలో, చల్లని గాలుల మధ్య గ్రామ ప్రజలు వనభోజనాలకు తరలివెళ్లి సుఖసంతోషాలతో గడిపారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు.

 

మహిళలు సంప్రదాయ దుస్తుల్లో కోలాటాలు వేస్తూ, జానపద పాటలు పాడుతూ వనభోజనాలకు మరింత కళ తీసుకువచ్చారు. కోలాటాల దెబ్బకు వనమంతా మారుమోగింది. ఒకవైపు వంటలు, మరోవైపు ఆటలు, నవ్వులు, కేరింతలతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది.

“ఏడాదికోసారి ఇలా అందరం కలిసి వనభోజనాలకు రావడం చాలా సంతోషంగా ఉంది. మన పాత సంస్కృతి, కోలాటం వంటి కళలను పిల్లలకు పరిచయం చేయడమే దీని ఉద్దేశం” అని నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.