📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్‌ 2న ఆందోళన

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్‌ 2న ఆందోళన

📰 Generate e-Paper Clip

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్‌ 2న ఆందోళన

కేపీహెచ్‌బీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన
పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలి:

మేడ్చల్ టియుడబ్ల్యూజె మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు మండల మురళీధర్ (ప్రజావాణి):- జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అక్టోబర్‌ 2న నిర్వహించనున్న శాంతియుత ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు మండల మురళీధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం కేపీహెచ్‌బీ మెయిన్‌ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టుల సమస్యలపై శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా మండల మురళీధర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నప్పటికీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోవడం ఆందోళనకరమన్నారు. రాష్ట్రంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టుల సంక్షేమం, భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
గత మూడేళ్లుగా జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు సంబంధించి తగిన చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. గతంలో అమలులో ఉన్న హెల్త్‌ స్కీమ్‌ను పునరుద్ధరించి జర్నలిస్టులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చకుండా ప్రకటనలకే పరిమితమైందని పేర్కొన్నారు.
అదేవిధంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ఇళ్ల సమస్యలను పరిష్కరించాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, గృహ వసతి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టుల ఆర్థిక భద్రత కోసం వేతన బోర్డు అమలు చేయడంతో పాటు విధి నిర్వహణలో జర్నలిస్టులకు రక్షణ కల్పించే చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపట్టేలా ఒత్తిడి తీసుకురావడమే ఆందోళన ప్రధాన ఉద్దేశమని మురళీధర్ తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 2న కేపీహెచ్‌బీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించనున్న శాంతియుత నిరసనలో మేడ్చల్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.