📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవంగపల్లిలో రజక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

వంగపల్లిలో రజక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

📰 Generate e-Paper Clip

వంగపల్లిలో రజక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

ప్రజావాణి అక్టోబర్ 1 కమలాపూర్ మండల్ వంగపల్లి గ్రామ రజక సంఘం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సంఘం అభివృద్ధి రజకుల సంక్షేమం ఐక్యత కోసం నూతన కార్యవర్గం కృషి చేయాలని సభ్యులు ఆకాంక్షించారు

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులుగా దురిశెట్టి సాంబయ్య ఉపాధ్యక్షులుగా దేవరాజు పాపయ్య క్యాషియర్ ఫైండ్ల రాకేష్ ను సభ్యులు ఎన్నుకున్నారు

నూతన కార్యవర్గం ఎన్నిక
సభ్యులు మాట్లాడుతూ రజకుల సమస్యల పరిష్కారానికి సంక్షేమానికి యువత అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని కోరారు సంఘంలోని ప్రతి సభ్యుడిని కలుపుకొని ముందుకు సాగుతూ రజకుల హక్కులు అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేయాలని అన్నారు

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామంలో రజక సంఘాన్ని మరింత బలోపేతం చేసి సభ్యుల అవసరాలకు అండగా నిలుస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు సంఘం అభివృద్ధి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని సభ్యులందరితో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు
నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి సంఘం సభ్యులు గ్రామ ప్రజలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు రజకులు అభివృద్ధికి నూతన కార్యవర్గం తన వంతు కృషి చేసి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.