📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగాంధీ జయంతి వేళ.. మద్యం దుకాణాలు బంద్

గాంధీ జయంతి వేళ.. మద్యం దుకాణాలు బంద్

📰 Generate e-Paper Clip

గాంధీ జయంతి వేళ.. మద్యం దుకాణాలు బంద్!

అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా డ్రై డే.. వైన్‌షాపులు, బార్లు, పబ్‌లకు తాళాలు

హైదరాబాద్, అక్టోబర్ 1 (ప్రజావాణి): మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా డ్రై డే అమల్లో ఉండనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు నిలిచిపోనున్నాయి.
వైన్‌షాపులు, బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, కల్లు దుకాణాలు, స్టార్ హోటళ్లలోని మద్యం విక్రయ కేంద్రాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అక్టోబర్ 2న ఎలాంటి మద్యం విక్రయాలు జరపకుండా నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులు వ్యాపారులను కోరారు.
గాంధీజీ అహింసా సిద్ధాంతాలను స్మరించుకునే ఈ రోజున మద్యం విక్రయాలను నిలిపివేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున మద్యం వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.