హిందూ ధర్మంపై వ్యాఖ్యలకు నిరసన.. కూకట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
కూకట్పల్లి : అక్టోబర్ 1 (ప్రజావాణి)
కూకట్పల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు హిందూ ధర్మానికి, హిందూ సమాజ ఆత్మగౌరవానికి అవమానకరమని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పిలుపు మేరకు కూకట్పల్లి డివిజన్ అధ్యక్షుడు పి. దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లు, హిందూ ధర్మంపై అవమానకర వ్యాఖ్యలు చేయడం తగదని నాయకులు పేర్కొన్నారు
