గుగ్గిళ్ల రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం
బెజ్జంకి, అక్టోబర్ 1 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామానికి చెందిన నూతనంగా ఎన్నికైన పీఏసీఎస్ డైరెక్టర్ కేడిక అపర్ణ, గుగ్గిళ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూశెట్టి ప్రశాంత్ రెడ్డి,గుగ్గిళ్ల గ్రామ కరీంనగర్ డెయిరీ అధ్యక్షుడు కేడిక మధుసూదన్ రెడ్డి, వార్డు సభ్యులు దూశెట్టి రాజిరెడ్డి,లను గుగ్గిళ్ల గ్రామ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

