📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఎన్ హెచ్ హైవే మేనేజర్ రసూల్

రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఎన్ హెచ్ హైవే మేనేజర్ రసూల్

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల, సెప్టెంబర్ 28 ప్రజావాణి  హైవే 6 లైన్ రోడ్ దాదాపు 23 కిలోమీటర్ల మేర మల్లేపల్లి నుంచి చెన్నారెడ్డి పేట గ్రామం వరకు వచ్చిందని, హైవే నిర్మాణంలో నష్ట పోయిన రైతుల పొలాలకు సంబంధించి రావాల్సిన నష్ట పరిహారం ఇంకా 40 శాతం వరకు మిగిలివుందని, వెంటనే ఇప్పించాలని చెన్నారెడ్డి పేట రైతులు మురళీ మోహన్ రెడ్డి, సిద్దు గురివిరెడ్డి, అంబవరం గురివిరెడ్డి, ప్రతాప్ రెడ్డి కోరుతున్నారు.రెవిన్యూతో కుమ్మక్కైన ఎన్ హెచ్ హైవే మేనేజర్ రసూల్ తో రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమస్య లేకపోయినా,సమస్య ఉన్నట్లు సృష్టించి రైతుల వద్ద నుంచి భారీగా డబ్బులు దండుకోవడమే కాకుండా చెన్నారెడ్డిపేట నుంచి మట్టి, గ్రావెల్ తో పాటు, చెన్నారెడ్డిపేట కొండనుంచి కూడా అక్రమంగా మట్టి తోలుతున్నాడనిని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్లకు పనులు ఇస్తున్నాడని, రైతులను ఇష్టం వచ్చినట్లు భూతులు మాట్లాడుతున్నాడని, ఈయన వేధింపులు తట్టుకోలేక ఒక రైతు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారని మురళి మోహన్ రెడ్డి చెబుతున్నారు. ముడుపులు ముడితేనే ఫైళ్లు కదిలిస్తూ వున్నాడని చెబుతున్నారు. రసూల్ ను ప్రసన్నం చేసుకొని 2 నుంచి 3 శాతం కమీషన్ ఇస్తేనే సహకరిస్తున్నాడని రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు. లోకల్ సబ్ కాంట్రాక్టర్ల వద్ద నుంచి కూడా 2 నుంచి 3 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నాడని, డబ్బులిస్తేనే బిల్లులు చేయిస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని సబ్ కాంట్రాక్టర్లు కూడా బాధను వెలిబుచ్చుతున్నారు. సంబంధిత అధికారులు, కంపెనీ పెద్దలు రసూల్ పై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అతనే రైతులకు సమస్య సృష్టించి అతనే పరిష్కరిస్తున్నాడని ఇది మంచి పద్దతి కాదని, దుర్మార్గమైన చర్య అని, ఇతని అక్రమాలు అరికట్టాలని కోరుతున్నారు. రసూల్ నుంచి తమ గ్రామ రైతులను కాపాడి, వాళ్లకు రావాల్సిన డబ్బులు వెంటనే పడేలాగ చూడాలని, రైతులను కష్టాలనుంచి గట్టెక్కించాలని మురళి మోహన్ రెడ్డి కోరుతున్నారు.అలాగే చెన్నారెడ్దిపేటకే చెందిన సిద్దారెడ్డి మాట్లాడుతూ.హైవే కు ఇరువైపులా వున్న తన పొలాలు సర్వే నెంబర్ 216/7 లో 41 సెంట్లు, 23/6 లో 33 సెంట్లు,23/3 లో 9సెంట్లు, 11/14లో 35 సెంట్లు,16/15 లో 24 సెంట్లు పోతోందని, ఇంతవరకు నాకు ఒక్క రూపాయి కూడా పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రసూల్ ను అడగ్గా నా పర్సంటేజ్ నాకిస్తే చేయిస్తాను అంటున్నాడని చెబుతున్నారు. నాకు డబ్బులు పడకపోవడంతో పనులు జరగకుండా ఆపి వున్నాను అని చెబుతున్నారు. తన భూమి మొత్తం హైవే లో 1 ఎకరా 70 సెంట్లు పోయిందని చెబుతున్నారు. నాపొలాలు 4 నుంచి 5 కోట్ల విలువ చేస్తాయని నష్టపరిహారం పెంచమని అడిగితే మీది అవార్డు అయింది పెంచడం కుదరదు అంటున్నారని,తహసీల్దార్, ఆర్డీఓ ల చుట్టూ తిరిగి వేసారిపోయాను అని రైతు సిద్దయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.