📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమంచాల మండలం ఎంఈఓ రాందాస్‌కు ఘన సన్మానం

మంచాల మండలం ఎంఈఓ రాందాస్‌కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

*మంచాల మండలం ఎంఈఓ రాందాస్‌కు ఘన సన్మానం*

రంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 28 (ప్రజావాణి) రంగారెడ్డి జిల్లాలో ఉత్తమ ఎంఈఓగా ఎంపికైన మంచాల మండల ఎంఈఓ రాందాస్‌ను ప్రజాసంఘాల అధ్యక్షుడు కంబాలపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు, ముఖ్యంగా పేద కుటుంబాల పిల్లలు అధిక సంఖ్యలో పాఠశాలలకు వచ్చేలా ఎంఈఓ రాందాస్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.

బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్న రాందాస్‌ను అభినందించారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం అందించే వివిధ సౌకర్యాలు, స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కంబాలపల్లి భాస్కర్ ఎంఈఓను కోరారు.

విద్యారంగంలో మంచాల మండలాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ఆకారం కృష్ణ, ఊదరి నరసింహ, కాళ్ల జంగయ్య, గ్యార దేవేందర్, ఏర్పుల మల్లేష్, దంచుక భిక్షపతి, లింగంపల్లి వార్డు మెంబర్ ఎరుపుల శీను, కొంకాని కృష్ణ, బక్కతట్ల ఐలయ్య, కాళ్ల చంద్రయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.