📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబహుజన రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేయాలి - బీఎస్పీ నాయకులు

బహుజన రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేయాలి – బీఎస్పీ నాయకులు

📰 Generate e-Paper Clip

*బహుజన రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేయాలి – బీఎస్పీ నాయకులు*

*బహుజన రాజ్యాధికార సమరభేరి వాల్ పోస్టర్ ఆవిష్కరణ*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 28(ప్రజావాణి):
మాన్యవర్ కాన్షీరామ్ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న హైదరాబాద్ లో నిర్వహించనున్న బహుజన రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేయాలని కోరుతూ జనగామలో సోమవారం బీఎస్పీ నాయకులు వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

జనగామలో జిల్లా నాయకులు చిలుముల అర్జున్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు నీర్మాల రత్నం హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాన్యవర్ కాన్షీరామ్ బహుజన సమాజాన్ని రాజకీయంగా, సామాజికంగా చైతన్యపరిచి రాజ్యాధికార దిశగా నడిపించేందుకు చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు బహుజనులు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అక్టోబర్ 9న హైదరాబాద్ లోని మున్సిపల్ గ్రౌండ్ లో నిర్వహించనున్న సభకు జనగామ జిల్లాలోని బహుజనులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. సభ విజయవంతం కోసం గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మడిపడిగ చంద్రశేఖర్, జేరిపోతుల మల్లయ్య, ఇరుగు మహేందర్, జలగం ప్రవీణ్, పిడుగు నవీన్, నేనావత్ చక్రి, ప్రవీణ్, సన్నీ, బంటి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.