*జనగామలో ఘనంగా భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 28(ప్రజావాణి):
జనగామ పట్టణంలోని సంజయ్ నగర్ భగత్ సింగ్ చౌక్ వద్ద భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
భగత్ సింగ్ విగ్రహ నిర్మాత, ముఖ్యఅతిథిగా హాజరైన 15వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మారబోయిన పాండు యాదవ్ గారు విగ్రహానికి పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దేశం కోసం చిరునవ్వుతో మృత్యువును కౌగిలించుకొని ఉరికొయ్యను ఉయ్యాలగా మార్చుకున్న విప్లవ వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు. ఆయన త్యాగం, ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, ‘నీ మరణం ఎన్ని జన్మలకైనా ఆశయ కిరణమే’ అని నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ యూత్ వ్యవస్థాపకుడు మంతెన మణికుమార్, యూత్ సభ్యులు, కాలనీవాసులు, వివిధ స్వచ్ఛంద యువజన సంఘాల నాయకులు ఇరుగు కృష్ణ, కొత్తపల్లి వాసు, వంగ సతీష్, కొత్తపల్లి రక్షిత్, భగత్ సింగ్ సభ్యులు సర్దార్ శంకర్ సింగ్, ఎండి అంజాద్, సుర్జేజిత్ సింగ్, సిద్దిరాల చందు, అమ్మ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కొయ్యడ రవి, వంగ భీమ్ రాజ్, ఎండి అజిత్, పిట్టల కృష్ణ, తుంగ సతీష్ బాబు, చిక్కుడు నాగేష్, గొల్లరి చందు, ఎండి పాషా తదితరులు పాల్గొన్నారు.

