📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణYadadri Bhuvanagiriడ్రైవింగ్ లైసెన్స్‌ దారులకు అలర్ట్..గాబరా వద్దు

డ్రైవింగ్ లైసెన్స్‌ దారులకు అలర్ట్..గాబరా వద్దు

📰 Generate e-Paper Clip

*డ్రైవింగ్ లైసెన్స్‌ దారులకు అలర్ట్..గాబరా వద్దు…!*

*మొబైల్ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్ రద్దవుతుందన్న ప్రచారం అవాస్తవం.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 28*

డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను తప్పని సరిగా లింక్ చేయించు కోవాలని , ఈ నెలాఖరు లోగా నంబర్‌ లింక్ చేయించుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవు కాకతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ప్రచారంపై వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. మొబైల్ నంబర్ లింక్ చేయలేదనే కారణంతో డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసే నిబంధన ప్రస్తుతం లేదని వెల్లడించారు. అయితే , డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసు కోవడం ద్వారా రవాణా శాఖకు సంబంధించిన సమాచారం , ఓటిపిలు , ఇతర సేవల వివరాలు సులభంగా పొందవచ్చు. కాబట్టి వాహనదారులు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మ కుండా , అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.