📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబెజ్జంకిలో డ్రైనేజీలు శుభ్రం చేయాలి

బెజ్జంకిలో డ్రైనేజీలు శుభ్రం చేయాలి

📰 Generate e-Paper Clip

బెజ్జంకిలో డ్రైనేజీలు శుభ్రం చేయాలి

మురుగు నీటితో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

బెజ్జంకి, సెప్టెంబర్ 28 (ప్రజావాణి)

బెజ్జంకి గ్రామంలోని డ్రైనేజీలను వెంటనే శుభ్రం చేయాలని సీపీఎం పార్టీ గ్రామ కార్యదర్శి బొమ్మిడి సాయికృష్ణ డిమాండ్ చేశారు.ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డ్రైనేజీ సమస్యపై ఫిర్యాదు చేశారు.
బస్టాండ్ నుంచి కాలేజీ రోడ్డు వరకు డ్రైనేజీలు పూర్తిగా నిండిపోయి మురుగు నీరు నిల్వ ఉంటోందని, దీంతో తీవ్ర దుర్వాసన వస్తోందని తెలిపారు. దోమలు, ఈగలు పెరిగి పిల్లలు, వృద్ధులు, కాలనీవాసులు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీలను శుభ్రం చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని సాయికృష్ణ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంగా ఎల్లయ్య పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.